Letra de
Suvarthanu Prakatinchava

సువార్తను ప్రకటించవా! సునాదము వినిపించవా !
సిలువను ప్రకటింపవా ? దాని విలువను వివరించవా
లెమ్ము సోదరా ? లేలేమ్ము సోదరీ

నీలో ఆత్మను ఆరనీకు - యెదలో పాపము చేరనీకు
నిన్ను నమ్మిన యేసయ్యాకు - నమ్మక ద్రోహం చేసెదవా
నిన్ను నమ్మిన యేసయ్యాకు - నమ్మక ద్రోహం చేసెదవా

సుఖము సౌఖ్యము కోరి నీవు - సువార్త భారము మరిచినావు
సోమరివై నీ వుండా స్వామికి ద్రోహం చేసెదవా
సోమరివై నీ వుండా స్వామికి ద్రోహం చేసెదవా

సువార్త ద్వారము తెరిచియుండే శ్రీ యేసు - స్వరము పిలుచుండే
నీవే కదా ఆయేసుకు - సాక్షివని తెలసుకో
నీవే కదా ఆయేసుకు - సాక్షివని తెలసుకో