రండి యుత్సాహించి పాడుదము - రక్షణ దుర్గము మన ప్రభువే
రండి కృతజ్ణత స్తోత్రముతో – రారాజు సన్నిది కేగుదము
సత్ప్రభు నామము కీర్తనలన్ - సంతోష గానము చేయుదము
మన ప్రభువే మహా దేవుండు – ఘనమహాత్యము గల రాజు
భూమ్యాగాధపు లోయలను – భూధర శిఖరములాయనవే
సముద్రము సృష్తించెనాయనదే – సత్యుని హస్తమే భువిజేసెన్
ఆయన దైవము పాలితుల – ఆయన మేపెడి గొర్రెలము
ఆ ప్రభు సన్నిది మోకరించి – మాయన ముందర మ్రొక్కుదము
ఆయన మాటలు గైకొనినా – అయ్యవి మనకెంతో మేలగును
తండ్రికుమార శుద్ధాత్మకును – తగు స్తుతి మహిమలు కల్గుగాక
ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ – అయినట్లు యుగములనౌను ఆమెన్