Letra de
Kaluvari Siluva Siluvalo Viluva

కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిసెనుగా
కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా

అజేయుడా విజేయుడా - సజీవుడా సంపూర్ణుడా
అజేయుడా విజేయుడా - సజీవుడా సంపూర్ణుడా

కష్టాలలోన నష్టాలలోన నన్నాదుకొన్నావయ్యా
వ్యాధులలోన బాధలలోన కన్నీరు తుడిచావయ్యా
కష్టాలలోన నష్టాలలోన నన్నాదుకొన్నావయ్యా
వ్యాధులలోన బాధలలోన కన్నీరు తుడిచావయ్యా
మధురమైన నీ ప్రేమ - మరువగలనా ఆ ప్రేమ
మధురమైన నీ ప్రేమ - మరువగలనా ఆ ప్రేమ
అనుక్షణం నీ ఆలోచన - నిరంతరము నాకు నీవిచ్చిన

పాపానికైనా శాపానికైనా రక్తాన్ని కార్చావయ్యా
దోషానికైనా ద్వేషానికైనా మరణించి లేచావయ్యా