యెహోవా నా కాపరి – యెహోవా నా ఊపిరి – నాకు లేమి లేదు
లోయలలో, లోతులలో – యెహోవ నాకాపరి
సంద్రములో, సమరములో – యేసయ్య నా ఊపిరి
పచ్చిక గలచోట్ల నన్ను పరుండజేయును
శాంతి కరమగు జలముల కడకు – నన్ను నడిపించును
గాడాంధకారపు లోయలలో – సంచరించినను
అపాయమేమి కలుగదు నాకు – నీవు తోడుండగా
చిరకాలము నేను – యెహోవ సన్నిధిలో
నివాసముండెదను నేను – నిత్యము సేవింతును