Lyrics of
Maruchunna Samajamulona

మారుచున్న సమాజములోన మారని యువకులు లేవాలి
మారని యేసు మార్గములోన మరలక నడవాలి

చదువులలో పదవులలో పెదవులలో హ్రుదయములో
మాటలలొన పాటలోన
పరిశుద్ధతయే కావాలి
పరివర్తనయే రావాలి

మారుచున్న సమాజములోన

చూపులలో రూపులలో కోరికలో తీరికలో
అందములోన బందములోన
పరిశుద్ధతయే కావాలి
పరివర్తనయే రావాలి

మారుచున్న సమాజములోన

మోదములో భేదములో శోధనలో రోధనలో
సాధనలోన వాదనలోన
పరిశుద్ధతయే కావాలి
పరివర్తనయే రావాలి

మారుచున్న సమాజములోన

సేవలలో త్రొవలలో వేడుకలో కూడికలో
కవలికలోన గమనికలోన
పరిశుద్ధతయే కావాలి
పరివర్తనయే రావాలి

మారుచున్న సమాజములోన మారని యువకులు లేవాలి
మారని యేసు మార్గములోన మరలక నడవాలి