Lyrics of
Mahima Prabhu Neeku

మహిమ ప్రభు నీకే - ఘనత ప్రభు నీకే
స్తుతులు వందన స్తోత్రములు - పరిశుద్ధ ప్రభు నీకే
ఆరాధన, ఆరాధన
నా ప్రియుడు యేసునికే
నా ప్రియుడు దేవునికే

అమూల్యమైన నీ రక్తముతో విడుదల నిచ్చితివి
రాజులవలె యాజకులవలె నీకై పిలిచితివి
ఆరాధన, ఆరాధన
నా ప్రియుడు యేసునికే
నా ప్రియుడు దేవునికే

వెలుగుగ త్రోవన్‌ తోడైయుండి నడిపించు దైవమా
ప్రేమశక్తితో అగ్నితో వెలిగించు అభిషేక నాథుడా
ఆరాధన, ఆరాధన
నా ప్రియుడు యేసునికే
నా ప్రియుడు దేవునికే

ఏ వేళ వున్నట్టి రాబోవుచున్నట్టి మా గొప్పరాజువు
నీ నామం హెచ్చున్‌ నీ రాజ్యం వచ్చున్‌ నీ చిత్తం నెరవేరును
ఆరాధన, ఆరాధన
నా ప్రియుడు యేసునికే
నా ప్రియుడు దేవునికే